మంచివారు:-- యామిజాల జగదీశ్

 ఓరోజు శిష్యులందరు ఒక్క మాటగా గురువుగారిని ప్రశ్నించారు.

"మంచివాళ్ళందరూ ఒక్కటిగా కలిసుండటం వల్ల కలిగే మేలేమిటి?" అని.
గురువుగారు వెంటనే జవాబివ్వలేదు. 
శిష్యులను తమ ఆశ్రమానికి దగ్గర్లో ఉన్న నదీ తీరానికి తీసుకుపోయారు. 
అక్కడ ఓ గులకరాయి తీసి నదిలోకి విసిరారు. అది నీటిలో మునిగిపోయింది. 
మరుసటి రోజు శిష్యులను తెప్పోత్సవం జరుగుతున్న చోటికి తీసుకుపోయారు. 
అక్కడ ముస్తాబు చేసిన తెప్ప నీటిపై తేలియాడుతుండటాన్ని చూపుతూ గురువుగారు శిష్యులను అడిగారు ...
"చిన్నదైన రాయిని విసిరితేనేమో అది నీటిలో మునిగిపోయింది. రాయి చిన్నదనే కాదు పెద్దది విసిరినా మునిగిపోతుంది. అయితే రాయిఋన్నా తెప్ప పెద్దదయినా నీటిపై ఎలా తేలియాడుతోంది" అని.
శిష్యులు ఏవేవో సమాధానాలు చెప్పారు. 
అవేవీ సరికాదంటూ గురువుగారు "ఎవరితోనూ కలవక ఒక్కడుగా ఉన్నప్పుడు ఎంత మంచివాడైనప్పటికీ కొట్టుకుపోతాడు. కానీ నీటిపై తేలియాడే దుంగలతో కలిసుండటంతో ఎంతటి తెప్పయినా మునిగిపోనట్లు మంచివారందరూ ఒక్కటిగా కలిసుంటే ఈ మాయాజగత్తులో కొట్టుకుపోరు" అని చెప్పి శిష్యుల సందేహాన్ని నివృత్తి చేశారు.


కామెంట్‌లు