అత్త బిడ్డ అలిగి పోకు
ముత్యాల దండిస్తాను
మామ బిడ్డ మరలిపోకు
మంచిగంధం పూస్తాను
మరదలు పిల్ల రావమ్మా
మల్లె మాలలు ఇస్తాను
వయ్యారి పిల్ల రావమ్మా
వంక గాజులు వేస్తాను
కన్నెపిల్ల రావమ్మా
కాళ్ళకు కడాలెడుతాను
వన్నెల పిల్లా రావమ్మా
వడ్డానం తెచ్చి పెట్టాను
పట్టు చీర కట్టుకుని
నగలన్నీ పెట్టుకుని
నాట్యం చేస్తూ రావమ్మా
నా కనుల ముందు నిలువమ్మా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి