అలా...ఉండాలి ...!!:-___కె.ఎల్వీ హస్మకొండ.
ఈరోజుల్లో 
గుడిని ..బడిని 
నమ్మేట్లుగా లేదు !
నమ్మే అవకాశం 
ఇసుమంత కూడా 
కనుచూపు మేరలో లేదు !!

ఇప్పుడు జరుగుతున్నవి 
అప్పుడు జరగలేదని 
బల్ల గుద్ది చెప్పలేము ,

అప్పట్లో 
ప్రసార /ప్రచార సాధనాల 
జోరు తక్కువ !

అందుకే ..
జరిగినవన్నీ 
జనంలోకి 
వెళ్ళేవి కాదు ,

ఇప్పుడు ..
ఏమూల 
అఘాయిత్యం జరిగినా,
అది ఆడపిల్ల అయినా ,
చిన్నపిల్ల అయినా ,
రక్షించడం మానేసి ,
వీడియోలు రికార్డు చెసే 
విష సంస్కృతిలో 
వున్నాం ఇప్పుడు !!

చానళ్లకు పంపించి ,
రేటింగులు పెంచుకునే ,
ధన మదంతో 
తైతక్క లాడుతున్నాం !

బాధితులపైన ,
అడ్డమైన ప్రశ్నలు 
గుప్పించి 
గొప్ప పని చేసినట్టు ,
ఫీల్ అయిపోతున్నాం !!

ఆడ పిల్లలు ,
చదువుకోసం 
బడికి వెళ్లాలన్నా ,
దేవుడిని 
దర్శించుకోవడం కోసం ,
గుడికి వెళ్లాలన్నా ,
తల్లిదండ్రులు 
స్పెషల్ ఎస్కార్ట్ 
పెట్టుకొవలసిందే !

ఆడపిల్లల 
సంరక్షణలో 
ఇటు 
యింటివారిని,
అటు   
బయటివారిని ,
మనః స్పూర్తిగా 
నమ్మే రోజులుకావివి !

నేటి ఆడపిల్ల 
పుట్టుకతోనే ,
మిలిటెంటుగా 
మారిపోవాలి!

ఆత్మ స్థైర్యమే 
ఆయుధంగా చేసుకుని ,
ప్రతి ఒక్కరూ ..
నాటి వీరవనిత 
ఝాన్సీ లక్శ్మీ భాయి 
కావాలి!

మృగాళ్ల గుండెల్లో 
సింహ స్వప్నంగా 
మారాలి !!