అయిదు వేల సంవత్సరాల అతి పురాతనమైన పారిజాతం చెట్టు ఉత్తరప్రదేశ్ లోని ఫైసలాబాద్ మండలంలో ఉంది. ఇది భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది.
పారిజాతం చెట్టు గురించి పురాణాలలో కొన్ని కథలున్నాయి.
అమృతం కోసం పాల సముద్రం చిలికినప్పుడు నుంచి బయటకు వచ్చినవి అయిదు చెట్లు. వాటిలో పారిజాతం ఒకటి.
ఇంద్రలోకం నుంచి ఈ పారిజాతం మొక్కను అర్జునుడు భూలోకానికి తీసుకొచ్చాడని మహాభారత కథనం. తన తల్లి కుంతీదేవి కోరిక మేరకు అర్జునుడు పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడు. కుంతీ దేవి తన జన్మస్థలమైన కింటూరు అనే ప్రదేశంలో ఈ మొక్కను నాటింది. అందులో పూసే పువ్వులను శివపూజకు ఉపయోగించినట్టు కూడా మహా భారతం చెప్తోంది.
అతి పురాతనమైన చెట్టుగా పేరుపొందిన పారిజాతం కింటూరులో ఉంది.
మహాభారతంలో ఈ చెట్టుకు సంబంధించి మరొక ప్రస్తావన ఉంది.
శ్రీ కృష్ణుడు మరొక పారిజాత వృక్షాన్ని ఇంద్రలోకం నుంచి తన భార్యలైన సత్యభామ, రుక్మిణుల వ్యవహారంలో తీసుకొచ్చి ద్వారకలో నాటినట్టు ఈ కథ సాగుతుంది. అయితే నాటి ద్వారక సముద్రంలో మునిగిపోయినట్టు కూడా చెప్తారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పురాతనమైన పారిజాతం చెట్టు ఇదొక్కటే.
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఉత్తరప్రదేశ్ కి వచ్చి ఈ చెట్టుని దర్శించి నమస్కరిస్తారు. హిందూ మతస్తులు ఈ చెట్టుని ఎక్కువగా పూజిస్తారు. ప్రత్యేకించి నవదంపతులు ఎక్కువగా వస్తుంటారట.
కేంద్ర ప్రభుత్వం పారిజాతం విశిష్టతను గుర్తెరిగి ఈ చెట్టుపై ఓ పోస్టల్ స్టాంపుని కూడా విడుదల చేసింది.
ఇక్కడి పారిజాత వృక్షాన్ని సందర్శించటానికి అనువైన కాలం జూలై ముంచి అక్టోబర్ వరకు. కారణం, ఆ సమయంలోనే పారిజాతంచెట్టు పువ్వులతో వికసిస్తుంది.
ఈ చెట్టు మీద కాసే పువ్వులు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఈ చెట్టును ఇంద్రుడు స్వర్గం తీసుకొచ్చినట్లు చాలా మంది నమ్ముతారు.
పారిజాతం ఓ మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఈ పువ్వులు రాత్రిపూట వికసించి, ఉదయానికల్లా రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచీ పరచినట్లు కనిపిస్తుంది. ఈ పువ్వుల నుంచి సుగంధ తైలాన్ని తయారుచేస్తారు.
ప్రపంచంలోనే ఓ విలక్షణమైన వృక్షంగా దీనిని శాస్త్రజ్ఞులు అభివర్ణించారు. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షానికి ఉంది. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పువ్వులు ఐదు రేకులు కలిగి ఉంటాయి. ఈ వృక్షం మరొక గొప్పతనం దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే తప్ప ఎండిపోయి రాలిపోవటమంటూ జరగదు.
ఉత్తరప్రదేశ్ లో ఉండే ఈ చెట్టును ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. ఇది చాలా శక్తిమంతమైన చెట్టు అని వారి ప్రగాఢ విశ్వాసం.
విష్ణువు కోరిక మేరకు ఇంద్రుడు మానవజాతి ప్రయోజనాల కోసం ఈ పారిజాత చెట్టును భూమికి పంపాడంటారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి