రామ రాజ్యం: - సత్య వాణి

 రామ రాజ్యం రాముడు పరి పాలింన సమయము
రాముని పరిపాలనలో ప్రజలంతా
సత్యసంధులు
రాముని పరిపాలనలో ప్రజలు నియబధ్ధంగా జీవితం గడిపేవారు
రాముని పరిపాలనలో అసత్యం,
అధర్మం, లంచగొండితనం,దొంగతనం,దోపిడీ
దౌర్జన్యం వంటి ధర్మ దూరులు లేరు
నెలకు అవసరమైనంత మేరకు
మూడు వానలు కురిసేవి
కరువు కాటటకం దారిద్యం రాముని పాలనలో లేవు
ప్రజలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా,ఆనందంగా, సౌఖ్యవంతంగా రాముని
కాలంలో జీవించేవారు
రాముని పాలనలో అకాల మరణాలు లేనేలేరవు
రాముని కాలంలో ఏతండ్రీ తన
బిడ్డలకు తలకొరివి పెట్టవలసిన
దౌర్భాగ్య సంఘటనలు జరగ లేదు
ఇదీ రామ రాజ్యం అంటే
ఇలా శుశోభితంగా, సస్యశ్యామంలంగా, శుభిక్షంగా
వుండడానికి కారణం రాజు రాముడవ్వడం
అతడు సత్యసంధుడవ్వడం
అతడు ధర్మం తప్పక పోవడం
మాతాపితరుల యందు గౌరవం,స
అభిమానం కలిగి వుండడం
పరస్ర్రీలను తల్లిగా చెల్లిగా భావించడం
ప్రజలను కన్న బిడ్డలకన్నా మిన్నగా
భావించడం
రాముడు శీలవంతుడై వుండడం
భార్యను ప్రాణంగా భావించడం
ఇంకా అనేక సుగుణాలు కలిగిన
ప్రభువుగా పరిపాలన చెయ్యడం
ఇదీ రామరాజ్యం అంటే
ఇతడుా రాజంటే
ఇలాంటి రాజ్యం మళ్ళీ మళ్ళీ మనకు రావాలని
అలాగే రాముని వంటి రాజ్య పాలకులు కావాలని
సీతా రాముల కళ్యాణ శుభ సందర్భంగా ఆశ్రీరాముని వేడుకుందాం
ఆశుభ రామరాజ్యం మళ్ళీరావాలని, వస్తుందనీ ఆశిద్దాం!
జై శ్రీ రామ్ జైజై శ్రీరామ్