ఎవరికి..ఎవరు..!!:- ---కె.ఎల్వీ--హన్మకొండ .
చక్కని రోడ్లు వేస్తారు,!
మరునాడు,
టెలీఫోన్ వాళ్ళు
లేదా
నీళ్ల సరఫరా వాళ్ళు
విచక్షణా రహితం గా
తవ్వే స్తారు.....!!

తవ్విన వాళ్ళు
పద్దతిగా పూడిస్తే బావుణ్ణు!
పైన ఎత్తుగా
లోన గుల్లగా....
చిన్న వర్షం కురిసిందా!
రోడ్డు పని గోవిందా!!

ఇది_
ఎవరికి ఎవరు,
ఎలా చెప్పాలి?
ఎలా భాద్యులుని చేయాలి?

        

కామెంట్‌లు