సైకిల్ సరదాలు...!!:- -శ్యామ్ కుమార్ నిజామాబాద్.

 నేను దాదాపుగా ఆరో తరగతి చదువుతున్న రోజులు. మాకు భువనగిరి నుండి యాదగిరిగుట్ట అన్నది, దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరం. మేము ఆ రోజుల్లో సైకిళ్లు అద్దెకు తీసుకుని  యాదగిరి గుట్టకు బయలుదేరి వెళ్ళే వాళ్ళం. అందులో దైవభక్తి కంటే ఎక్కువగా మాకు సరదానే ప్రధానంగా  ఉండేది .మా స్నేహితులతో కలిసి   వెళ్ళేవాళ్ళం సైకిల్ మీద.ఎండలేదు -వాన లేదు ,ఏమీ లేదు, ఏమీ తెలియదు .నాకు అప్పుడు 11 సంవత్సరాల వయసు ఉంటుందేమో! అతికష్టం మీద సైకిల్  సీట్ యెక్కి తొక్కడం కూడా కష్టంగా ఉండేది, అందుకని పక్కలో   కాలు వేసి తొక్కుకుంటూ వెళ్ళేవాళ్ళం.  అక్కడ దైవదర్శనం లో పెట్టిన ప్రసాదం మాత్రమే తినేది మేము! అంతకంటే ఎక్కువ తినడానికి మా దగ్గర డబ్బులు అసలు  ఉండకపోయేది . మధ్య లో కూడా నీళ్లు తా  గి మేము తిరిగి బయలుదేరే వాళ్ళం. 
ఇలా వెళ్లడం ,మా ఆటలలో ఒక కార్యక్రమం.  ఇందులో పెద్ద వారి ప్రమేయం కానీ ,పెద్ద వారికి తెలియడం కానీ, ఏమాత్రం ఉండేది కాదు.  ఒకసారి రైలు పట్టాల పక్కనుండి కూడా వెళ్ళాను ,చాలా దగ్గరవుతుందని,  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని! ఎందుకంటే ఎప్పుడు ట్రైన్ వస్తుందీ,చూసుకుంటూ 
ట్రైన్ రాగానే,  చేతిలో ఉన్న సైకిల్ తీసి పక్కన పెట్టి నిలబడాలని అన్న మాట అది పోయేవరకు. చాలా భయపడ్డాను.  మళ్లీ వెళ్ల లేదు.  మరోసారి ఇలానే నేనూ,సుధాకర్,శర్మ  ,కలిసి వేళ్లా ము.  కొండ కింద సైకిల్ పెట్టి ,పైకి మెట్ల దారిలో ఎక్కి ,కల్యాణ కట్ట లో స్నానం చేశా ము.  తర్వాత కాసేపు ఎండలో నిలబడి వంటి మీదనే బట్టలు ఆర పెట్టు కున్నాo. గుడిలో కి వెళ్లి దండం పెట్టుకొని బయటకు వచ్చి తిరుగు ప్రయాణం మొదలు పెట్టా ము.  ఆ సమయంలో స్పెషల్ దర్శనం -టికెట్ వగైరా ,వుండేది కాదు.  ఎంత మంది ఉన్నా ,లైన్ లో వెళ్ల వలసిoదే! కాకపోతే ప్రత్యేక రోజుల లో మాత్రమే ఎక్కువగా భక్తులు వుండేవారు.  పులిహోర 5 పైసల కు ,కొని తిని ,ఎంతో సంతోషంగా వుండేవారు . అయితే అక్కడ కు  చిన్న చిన్న మట్టి కుండల లో పెరుగు అమ్మే వారు.  కొండ కింది నుండి గంపలో పెరుగు కుండ లు పెట్టుకుని ,పల్లే పడుచులు అమ్మే వారు,
తిరుగు ప్రయాణంలో కాస్త దూరం వెళ్ళాక బహుశా నాకు ఎండ వడ కొట్టిందేమో,ఒకసారి  నేను కళ్ళు తిరిగి కూర్చుండిపోయాను, ఒక చెట్టు కింద. నా స్నేహితులంతా ,నా వయసు వారు. ఏం చేయాలో తెలియక కూర్చొని కాసేపు నేను సైకిల్ తొక్కే- పరిస్థితి  లేదని  చూసి అందరు వెళ్ళిపోయారు..
 నేను అలా ఎంత సేపు పడుకున్నానో ..నాకే--- తెలియదు .ఎండలో అలా ఉండిపోయ ను-- నీరసంగా .నీళ్లు లేవు ,ఏమీ లేదు ,చూసే వాళ్ళు ఎవరు లేరు...!
మిట్టమధ్యాహ్నం చెట్టుకింద కూర్చున్నాను.అది భువనగిరి నుంచి వరంగల్ వెల్లే  రహదారి.
అంతలో రోడ్డు మీద నుంచి సైకిల్ తొక్కుకుంటూ, ఆనంద్  మామ అని, మా బాబాయ్  ఫ్రెండ్ - ఆయన టీచరు, ఆ రోడ్డు మీద వెళుతూ కనిపించాడు. 
 నేను " మామా..!"అని అరిచాను . అప్పుడు  ఏదో చిన్న చప్పుడు లాగా వినిపించింద ట,ఆయనకు, ఎందు కో చూసాడు .చెట్టు కింద నేను కనిపించాను. ఆ తర్వాత వచ్చి నా పరిస్థితి చూసి, నన్ను తన సైకిల్ మీద కూర్చోపెట్టుకుని ,నా సైకిల్ పట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ,మా ఇంట్లో  దింపి వెళ్ళారు. ఆనంద్ మామ అక్కడే రాయ గిరి , అనే వూరిలో ఉపాధ్యాయులు.  మా బాబాయి పెళ్ళి యాదగిరిగుట్టలో, మా చెల్లెలి పెళ్లి భువనగిరి లో, నా పెళ్లి యాదగిరి గుట్ట లో జరిగింది.  అన్నింటా ఆ మామ, మంచి పాలు -పెరుగు ,రాయ గిరి నుండే పంపారు. ఆయన కు ఇప్పుడు ఎనభై అయిదు- వయస్సు.మూడు రోజుల క్రితం వెళ్ళి కాళ్ల కు దండం పెట్టుకుని వచ్చాము, నేనూ నా భార్య లీల.  వారి సంతోషం, మాకు కలిగిన తృప్తి మానసిక ఆనందం చెప్పలేను . యెప్పుడూ ఇలాంటి చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వుంటాను. అవన్నీ తలచుకొంటే, జీవితాన్ని ఎంత లా  అనుభవించినదీ 
సినీమా రీలులా ,మదిలో తిరుగు తున్టుంది.
 -------------------------------------------                 
ఫోటోలో----ఆనంద్ మామ(రాయగిరి) దంపతులతోనేనూ-నా శ్రీమతి లీల.