విలేఖరి(నానీలు):-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
1.వార్తల సేకరణ
కత్తిమీద సాము
చీకటికోణాలు
బట్టబయలు.

2.అహర్నిశలు
పారాహుషార్
సమాజానికి
దర్పణం అవుతాడు.

3.ప్రభుత్వానికి
ప్రజలకు మధ్య
వారధిగా ఉండి
రాయబారవుతాడు.

4.రాజకీయాల
అనైతికతలను
పాంచజన్యమై
పూరిస్తాడు.

5.ఆనందమైనా
విషాదమైనా
శోధించి
విశదపరుస్తాడు.

6.రహస్య కెమెరాలా
రాణిస్తాడు.
గజ ఈతగాడిలా
వెలికితీస్తాడు.

7.నిజాన్ని నిగ్గుతీసే
సాధకుడు.
జర్నలిజాన్ని వాడే
విలేఖరి.