మస్తకమ్ము వెలుగు పుస్తకమ్ము లతోడ
మానసికము గాను మంచి తోడు
ధనము బంగరులకు ధాటిగసరిపోవు
చదువుకున్న విలువ చాలఘనము!
అయ్య యమ్మలవలె నతిముఖ్యపొత్తము
జీవితమ్ము గెలువ జీవ రక్ష!
మూఢ తిమిరమెల్ల ముడులుగా విడిపోవు
తెలివిగల్గు మనసు తేజరిల్లు!
ఒంటరి తనమదియు ఓటమిగలిగించు
పొత్తములను విజయ పోడిమలరు
ఊరు వెళ్ళగాను యుండవలెనుతోడు
పుస్తకమ్ములిచ్చు పూర్తిముదము!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి