చెరువులో ఉన్నాయి చిన్ని చిన్ని బాతులు
కరువుతీర యీదుతు కడుపు నిండు చేపలు
తల్లిబాతు ప్రక్కన తమ్ము విడువకుండును
బురదలో ముక్కుతో బుడ్డపక్కి పట్టును
ఒడ్డునే యెఱ్ఱలును ఒడుపుగా పట్టాయి
రెక్కలను విదిలించి రెల్లుపొద దాగాయి
గునగునా పిల్లలే గుంపులో కలిశాయి
పాదములు చీలికను పట్టుగా నడిచాయి
పల్లెలో రైతులకి పాడి తోటి పైసలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి