పోస్టాఫీస్ -బాల గేయం :--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఉత్తరాలు అందేచోటు 
పోస్టాఫీసు చాలా గ్రేటు 
పల్లెటూరు పట్టణాల్లో 
ప్రజాసేవ జరిగే చోటు !

 కార్డులూ కవర్లు అమ్ముతారు 
మని ఆర్డర్లూ పంపుతారు 
పుస్తకాలు,చిన్నవస్తువులు 
పార్సిల్చేసి పంపుతారు!

బుక్ పోస్ట్ అనివ్రాసినచో 
ఎంతదూరమైన పోతాయి 
సరిపడు స్టాంప్లు అతికిస్తే 
సర్రునఅడ్రెస్స్ చేరుతాయి!

పోస్ట్ మ్యాన్ ఇంద్రజాలికుడు 
పుట్టినరోజు బహుమతులు 
సంచీలోనుండి తీస్తాడు 
దూరంనుండి పంపేఆత్మీయులు!

ఉత్తరం వ్రాయుట ఎంతోసరదా 
కుటుంబపరిస్థితులు తెలుస్తాయి
నేటికాలంలో సెల్ఫోన్ దురద 
ఏకాకులుగా మలుస్తాయి!