ఇచ్చిపుచ్చుకో.(నీతికథ);-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


 అమరావతినగరం లోని అటవీశాఖ విశ్రాంతి అధికారి రాఘవయ్యగారి ఇంటి అరుగుపై ఆవాడకట్టులోని పిల్లలంతా చేరారు.అందరికి మిఠాయిలు పంచిన తాతయ్య"బాలలు మీఅందరికి ఈరోజు శాంతి ఎంతగోప్పదో తెలిపేకథ చెపుతాను.పూర్వం ధరణికోట అనేరాజ్యాన్ని విక్రమసేనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు.అతనికి,రాజ్యకాంక్ష,ధనదాహం ఎక్కువ.ఎప్పుడు ఇరుగు పోరుగు రాజులతో కలహించుకుంటూ,ప్రజల సౌకర్యాలు పట్టించుకునేవాడుకాదు.నీటిఎద్దడి రావడంతో కరువుతో ఆదేశప్రజలు అంతా విపరీతంగా ఇబ్బందులు పడసాగారు.

అతనికి పోరుగురాజ్యమైన అమరావతిని చంద్రసేనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు.ప్రజల అవసరాలను గమనిస్తూ,విద్యా, వ్యవసాయ, వ్యాపారరంగాలను బాగాప్రోత్సహించడంతో,ఆరాజ్యం సిరి సంపదలతో కళకళలాడుతూ ఉండేది. చంద్రసేనమహారాజు కోరికమేరకు ఆదేశ వ్యవసాయదారులు,వ్యాపారులు అంతా ప్రతివారం వందల వాహనాలపై నిత్యావసర వస్తువులు,కాయగూరలు,ధరణికోట రాజ్యంలోనికి తీసుకువెళ్లి ప్రజలకు నామమాత్రం ధరతో,నిరుపేదలకు ఉచితంగా అందజేయసాగారు.అమరావతి నగర వ్యాపారుల సహాకారంతో ధరణికోట రాజ్యం ప్రజలు కష్టాలనుండి తప్పుకుని సుఖంగా జీవించసాగారు.

తనరాజ్యంలో ప్రవహిస్తున్న కృష్ణానది నీటిని కాలువద్వారా ధరణికోట రాజ్య పొలిమేరలవరకు మళ్లించి,ఆరాజ్యప్రజల దాహార్తిని, వ్యవసాయానికిఅందించాడు.ఇదంతాగమనించిన ధరణికోటరాజు విక్రమసేనుడు మారువేషంలో అమరావతినగరంలో ప్రవేసించి ,చంద్రసేన మహారాజు ప్రజలను ఉద్దేసించి ప్రసంగిస్తుండటం వినసాగాడు."నాదేశ ప్రియప్రజలారా మనఇరుగు పొరుగు వారు బాగుంటేమనకుమంచిది. కష్టసుఖాఃలలో ఒకరికి ఒకరు సహాయంగా ఉంటాం.మనపొరుగువారు ఇబ్బందుల్లో ఉంటే మనకు ఏదైన సహాయం అవసరం ఐతే వారు ఆదు కోలేరుకదా! అందుకే మనం ఎదుటివారు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవాలి.వారి అవసరాలకు ఇచ్చి,మనఅవసరాలకు,పుచ్చుకోవడమే స్నేహధర్మం."అన్నాడు.అదివిన్నవిక్రమసేనుడు,చంద్రసేనుని సహాయానికి ధన్యవాదాలు తెలియజేసి,తను అదేదారిన పయనించి పాడి పంటలతో తనరాజ్యాన్ని కళకళలాడేలాచేసుకున్నాడు.


కామెంట్‌లు