హోలీ మణి పూసలు:-ఎడ్ల లక్ష్మి
హోలీ పండుగొచ్చింది
మోతుకు మొగ్గ వేసింది
పిల్లలంతా వచ్చారు
పూసిన చెట్టు నవ్వింది
 
గోగు పువ్వు తెంపినారు
కుండ లోన వేసినారు
కాసినారు నీరు పోసి
సర్వ లోన నింపినారు

కల్తి లేనిదంట రంగు
కాలుష్యం లేని రంగు
చిన్నారి ఆ పిల్లలకు
సింధూర వర్ణం రంగు 

సీసనిండ పోసినారు
పిల్లలంత వచ్చినారు
వారు హోలీ ఆడుతూ
ఆనందంగ ఉన్నారు