రెక్కలు .:-లీలా కృష్ణ.-తెనాలి
రెక్కలు కట్టిన నా అడుగులు..
అందుకున్నాయి చేయూతనిచ్చే నాన్న వ్రేళ్ళు.
ఏళ్ళు గడిచిన పిదప.. తీశాను, నాకై నేను పరుగులు.

నా కంటితో ఈ లోకానికి దిద్దాను.. మెరుగులు.
నా పెంకితనంతో కట్టాను ... నా కవితకు రెక్కలు.

రాతిరేళ పొడిచే చుక్కలు..
మోసుకొస్తాయి,  నా కలలకి రెక్కలు.

రెక్కల వేగాన్ని మించిన నా ఊహలు..
వద్దన్నా చూపుతాయి.. కొత్త కొత్త లెక్కలు.

ఇంతలోనే ...తెల్లారిందంటూ , నను త్రాకుతాయి సూరిడి రెక్కలు..
అంతలోనే .. పరు

గెడతాయి, నా కడుపులో ఎలుకలు.
ఇక తప్పదంటూ.. పొట్టకూటికై, మొదలెట్టాలి మహిమలు.


రెక్కలు ముక్కలు చేసుకొని బ్రతికితే ..రావు తిప్పలు..
గ్రద్దల్లా పొడుచుట మొదలెడితే.. తప్పవు చిక్కులు.

లౌక్యం ఎరిగి మసిలిన చాలు.. అందును, ప్రశంసలు.
అందరి సౌఖ్యాన్ని కోరి పలికిన వాక్కు.. " సర్వేజనా సుఖినోభవంతు".