పూసిన కలువలు (బాలా గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
కలువ పూలు పూసాయి
కాటుక కనులు చూసాయి
చెరుకుల చేతులు తెంపాయి
పూల బుట్టలో నింపాయి

తామరాకులు చూసాయి
తల్లిని పిలిచి చెప్పాయి
భూదేవి చూసి నవ్వింది
బురదగుంటలో దాగింది

పున్నమి జాబిలొచ్చింది
పరవశించి మురిసింది 
వెండి వెలుగులు పంచింది
వేకువజామున వెళ్ళింది

ధనలక్ష్మి   వచ్చింది
తామరలో కూర్చుంది
ప్రకృతిమాత చూసింది
లక్ష్మీ పూజలు చేసింది


కామెంట్‌లు