ఆమె...అలా..అడిగేసింది ..!!:-------శ్యామ్ కుమార్, నిజామాబాద్.

  నేను ఆ రోజుల్లో దాదాపుగా పది పన్నెండు దోశ  లు తినే వాడిని.  "పెరిగే వయసు అలాగే తినాలి "అని మా పిన్ని ఇంకా బాగా పెట్టేది.  ఇంటికి ఎవరు వచ్చినా చాలా బాగా ఆదరించేది. ఆవిడ కు 
 పెద్దరికం ఇచ్చేస్త సరి ,మీద మీద పడితే అన్ని పెట్టేసేది.  పాపం ఎవరు  పొగిడి నా, కరిగిపోయేది.  మా బాబాయి పెళ్లి జరిగి మా పిన్ని ఇంటికి వచ్చేసరికి నా వయసు దాదాపుగా తొమ్మిదిసంవత్సరాలు అనుకుంటాను.  పెళ్లి అయిపోయి ,మాతో  వస్తున్నప్పుడు ,మా పిన్ని పుట్టింట్లో బాగా ఏడుస్తూ వచ్చింది. నాకు తెగ చిరాకు అయిందనుకోండి .'మా ఇంటికి సంతోషంగా తీసుకెళ్తుంటే, పిన్ని  ఎందుకు  ఏడవటం? ' అని అనుకున్నాను.
 బాబాయి, ఆలేరులో పంచాయతి సమితి లో మేనేజర్ గా పని చేస్తూ ఉండేవారు. అక్కడ  ఎదురింట్లో కాస్త దూరంగా ఉన్న తలుపులోంచి ,ఒక  అమ్మాయి ఎప్పుడు నన్ను చూస్తూ ఉండేది. మా ఊర్లో నాకు ఎవరూ స్నేహితులు లేరు. నేను కూడా ఆ..అమ్మాయిని,చూస్తూ ఉండేవాడిని.
 ఒకరోజు నేను ఆరు బయట నిలబడి ఉన్నాను, ఆ..అమ్మాయి ,స్కూల్ నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి వెళుతూ వెళుతూ ఆగి నన్ను చూసి ," ఏం పేరు నీది? ఎప్పుడూ చూడటమే నా? మాటలు ఉండవా? అని అడిగింది. నేను ఆశ్చర్యంతో భయంతో ఏమీ అర్థం కాక నిలబడిపోయాను. అప్పుడు నా వయసు బహుష 14 సంవత్సరాలు. ఇంతలో మా బాబాయి ఇంట్లో నుంచి వచ్చి," ఏంట్రా ఏమైంది? "అన్నారు. నేను ఇంకా భయపడిపోయి నిలబడిపోయాను.  అప్పుడు మా పిన్ని బయటికి వచ్చి అడిగింది- "ఏమైంది ?"అని. "ఏమో చూడు !"అని మా  బాబాయి లోపలికి వెళ్లిపోయారు.  ఆ అమ్మాయి  వాళ్ళ ఇంటికి వెళ్లి పోయింది. జరిగింది  విని మా పిన్ని , "ఒరేయ్ వాళ్ల గయ్యాలి మనుషులు, వాళ్ళ తో పెట్టుకోకు "అంది.  "సరే పిన్ని !"అని బుద్ధిగా-  లోపలకి వెళ్ళిపోయాను మళ్లీ అటు వైపు చూస్తే ఒట్టు. తన సొంత పిల్లల కంటే ఎక్కువగా నన్ను  ఆదరించేది మా పిన్ని. వారి పెళ్లి సమయానికి మా తాతగారు లే రు కాబట్టి ,మా నాన్న గారు  బాధ్యత తీసుకొని మా బాబాయ్ పెళ్ళి  చేశారు. నా వివాహ సమయానికి మా నాన్నగారి ఆరోగ్యం బాగా లేదు . అప్పుడు నా పెళ్లి బాధ్యత అంతా మా పిన్ని- బాబాయ్ తీసుకుని వివాహం జరిపించారు.  మా నాన్నమ్మ మా బాబాయి లు ,మా   పిన్నివాల్లమధ్య గడుపుతుంటే ,నాకు ఏనాడు మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చే వారు కాదు.  నేను పదవ తరగతి వచ్చేవరకూ అలాగే, బంగారు  స్వప్నంలా నా- బాల్యం గడిచింది.
          
కామెంట్‌లు