చెత్త బండీ వస్తుందండీ
క్రమం తప్పక ఇవ్వండి
రెండు రంగుల బక్కెట్లూ
తడి,పొడి చెత్త వేయాలి!
కూరగాయల పొట్టును
మిగిలిన అన్నం కూరలూ
పండ్ల తొక్కలు,తడిచెత్త
కలుపకు దీనిలో పొడి చెత్త!
ప్లాస్టిక్ కవర్లు కాగితము
విరిగిన చెక్క,పింగాణీ
శీలలు నట్లు బొమ్మలు
నీళ్ళసీసాలు పొడిచెత్త !
తడిచెత్త ఎరువుగవుతుంది
పొడి చెత్త రీసైకిల్ అవుతుంది
గుర్తుగా వేరు చేయండి
పౌరుల బాధ్యత తెలియండి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి