ఏది వ్రాస్తే అదే అదే ఆలోచిస్తాం !?:-ప్రతాప్ కౌటిళ్యాMSc, Bio-ChemMtech, Bio-Tech, Lecturer in Bio-Chem

 మన ఆలోచనలు ఎలా ఉంటే మనం అలాగే తయారు అవుతామని మనకు తెలుసు  అంటే మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ గానే మనం తయారు అవుతామని అలాగే జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే అందరూ తమ తమ ఆలోచనలను జాగ్రత్తగా ఎన్నిక చేసుకుని జాగ్రత్తగా మనం ఆలోచించాలని మనం గుర్తించాం.
సరిగ్గా అలాగే మనం ఒక సినిమాను చూసినప్పుడు అందులోని పాత్రలు వ్యక్తిత్వాలు ఆలోచనలు నడవడిక నటన మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అంటే మన ఆలోచనలు కూడా అలాగే కొనసాగుతూ ఉంటాయన్నమాట. మనం నమ్మిన నమ్మకపోయినా ఆ సినిమాను చూసాము కాబట్టి అలాంటి ఆలోచనలు మనకు కలుగుతాయి అన్నమాట ఎంతవరకు దాని ప్రభావం అన్నది పక్కన పెడితేఅలాగే ఆలోచిస్తామని మనకు అర్థం అవుతుంది.
అలాగే ఏదైనా పుస్తకం పాఠ్య పుస్తకం చదివినప్పుడు మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అంటే పుస్తకం లోని అంశాలు మనల్ని మన ఆలోచనలను కొత్తగా కలిగించడమే కాక వాటిలోని అంశాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అంటే పుస్తకం లోని అంశాలు మన ఆలోచనలు ప్రభావితం అవడమే కాక కొనసాగుతూనే ఉంటాయి కనుక మన ఆలోచనలు ఎన్నిక చాలా ముఖ్యం. ఎందుకంటే ఏది చదువుతేఅదే మన ఆలోచన కాబట్టి మన ఆలోచనలు కాబట్టి మనం అలాగే ఆలోచిస్తాం.మనం అలాగే తయారవుతాం అందుకే మన ఆలోచనలే మనం .ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మనం ఒక మనిషితో ఏది మాట్లాడతామో అదే మనం గా మారుతాం అని గుర్తుంచుకోవాలి.
సరిగ్గా అలాగే మనం మాట్లాడడానికి మన ఎదురుగా మనిషి లేనప్పుడు మనం ఏదైనా నా రాత పూర్వకంగా మన ఆలోచనలను రికార్డ్ చేస్తామో అంటే రాసుకుంటామో ఆలోచనలు నెగిటివ్ పాజిటివ్ అయినా మనల్ని ఆ దినమంతా లేదా కొంత సమయం వరకు వెంటాడుతూనే ఉంటాయి.
అందుకే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎలా రాసుకుంటావో అలాగే ఆలోచిస్తావ్ అలాగే ప్రవర్తిస్తావు అలాగే నేర్చుకుంటావు అలాగే మాట్లాడుతావు అలాగే ఉంటావు. అంటే నీవు ఏదైతే రాసుకుంటావో నీ ఆలోచనలను అవి అలాగే వెంటాడుతాయి. అంటే నిన్ను శాసిస్తావీ, నీకు భోదిస్తావీ, నీకు నేర్పిస్తాయి నీవు అలాగే ప్రవర్తిస్తావు.
అందుకేఏది రాసిన జాగ్రత్తగా రాసుకోవాలని దీని ద్వారా అర్థమవుతుంది.
ముఖ్యంగా విద్యార్థులు ఏది చదువుతారో అదే ఆలోచిస్తారు . ఏది చదువుతారో అదే నేర్చుకుంటారు. సరిగ్గా అలాగే ఏది రాస్తారో అదే నేర్చుకుంటారు. ఏది రాస్తారో అదే ఆలోచిస్తారు. ఈ చిన్ని శాస్త్రీయ సత్యాన్ని తెలుసుకుని పిల్లలు మసలుకోవాలి పెద్దలు జాగ్రత్త పడాలి.
ప్రతాప్ కౌటిళ్యా
Lecturer in Bio-Chem