*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౦౪ - 04)

 శార్దూలము :
*నీ నాసం దొడబాటుమాట వినుమా | నీచేత జీతంబు నే*
*గానింబట్టక, సతతంబు మరివే | డ్కన్గొల్తు, సంతస్సప*
*త్నానీకంబున కొప్పగింపకుము న | న్నాపాటియేచాలు, తే*
*జీనొల్లంగరినొల్ల నొల్ల సిరులన్ |  శ్రీకాళహస్తీశ్వరా* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నీకూ, నాకు మధ్య ఇద్దరకూ నచ్చే ఒక ఒప్పందం వెప్తాను విను.  నేను నిన్న నా మనస్సులో వుంచుకుని, ఎంతో భక్తి తో ప్రతి రోజూ కొలుస్తూ వుంటాను.  నువ్వు నన్ను నా లోపల వున్న కామ, క్రోధ, లోభ, మద, మత్సరములకు,  సంసారము వల్ల వచ్చే కష్టాలకు బందీగా అప్పగించకు.  నాకు, గర్రాలూ వద్దు, ఏనుగులూ వద్దు, సంపదలు అసలే వద్దు  .... అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*పరమేశ్వర, పరంధామా, మేము నీతో కూడా బేరాలు ఆడి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము స్వామి, నీచే సృష్టించబడిన మాయలో వుంటున్నాము కదా.  నీవు అతి గాఢమైన భక్తితో ఇచ్చే పత్రం, పుష్పం, ఫలం, తోయం లకైనా లొంగి వుంటావు అనే ధ్యాస మాకేది, ఉమాపతీ.  అయ్యా, మాకు ఏ సంపదలూ వద్దు, సమాజంలో మర్యాదలూ వద్దు, కానీ సతతం నీ ధ్యాన్నం నుండి మా ధ్యాస మరలకుండా నీవే కరుణించాలి, పన్నగభూషణా...... మార్కండేయ రక్షకా!*..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss