*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౦౫ - 05)

 శార్దూలము :
*భవకేళీ మదిరామదంబున మహా |  పాపాత్ముడై వీడు న*
*న్ను వివేకింపడటంచు, నేను నరకా | ర్ణోరాశిపాలైన బ*
*ట్టవు, బాలుం డొకచోట నాటతమితో | డ న్నూతగూలగంగ దం*
*డ్రి విచారింపక యుండునా కటకటా | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నీవే సృష్టించిన పుట్టుక, చావు అనే ఆటలోని ఆనందంలో మునిగి వున్న నన్ను చూచి వీడు నన్ను గుర్తు వుంచుకోవడం మరచిపోయాడు అనుకుంటున్నావు.  నేను నరకంలో వుండి పాపాలు చేస్తున్నా పట్టించుకోవటల్లేదు.  ఆటలు ఆడుకుంటున్న తన కొడుకు బావిలో పడిపోతే, ఆ బాలుడి తండ్రి పట్టించుకోకుండా వుంటాడా, చంద్రశేఖరా! .... అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*పరమేశా మేమంతా నీచే సృష్టించబడిన మాయాను అర్థం చేసుకోలేక ఆ మాయలో ఆనందం వుంది అనుకుని పాపాలు చేస్తూ, నిన్ను గుర్తించ లేక పోతున్నాము.  కానీ నీవు ఆడే ఆటను గుర్తించగలిగే సామర్ధ్యం మాకు నీవే ఇవ్వాలి అని నీకు తెలుసు కదా, శంభో. ఇంకా మాకు ఈ పరీక్షలు ఏమిటి, ఇందిరా పతీ.  మమ్మల్ని ఈ నరక కూపం నుంచి బయట పడేయగల కన్న తండ్రివి నీవే శివా!*..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss