*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౦౮ - 08)

 శార్దూలము :
*నీతో యుద్ధము చేయనోప, గవితా | నిర్మాణశక్తి న్నిన్నుం*
*బ్రీతుం చేయగలేను, నీకొరకు తం | డ్రిన్ చంపగాజాల నా*
*చేతన్ రోకట నిన్ను మొత్తవెరతుం | చీకాకు నా భక్తి యే*
*రీతి న్నాకిక నిన్ను చూడనగున్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
నీతో పోట్లాడి నిన్ను మెప్పించాడినికి నేను అర్జునుణ్ణి కాదు.  నీ మీద కవితలు రాసీ నిన్ను పొగడలేను.  పార్వతీ దేవి లాగా నీ కోసం నా తండ్రి నీ చంపలేను.  నా చేతిలో వున్న రోకలితో నిన్ను కొట్టి నొప్పించలేను.  నీ మీద నాకు ఉన్న భక్తి వల్లనే ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇంక నిన్ను నేను ఎలా చూడ గలుగుతాను, ముక్కంటీ......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నీవు ఎరుకల వాడిగా, అమ్మ ఎరుకతగా వచ్చినా నీతో యుద్ధం చేయలేను, నేను అర్జునుణ్ణి కాదు కదా.  కవిత్వం చెప్పి మెప్పించడానికి నేను శృంగినీ కాదు, భృంగిని అంతకన్నా కాదు. నా తండ్రి ని చంపటానికి అంబను కాను. కానీ నాకు తెలిసింది ఒక్కటే. నిన్నే నమ్మి నిన్నే పూజించడం. నిన్ను చేరే ఈ దారిలో నాకు కలిగే బాధలను నీవే తొలగించాలి, అర్ధనారీశ్వరా!అపర కాళికను ప్రసన్నం చేసుకున్న, పార్వతీ పతీ, నన్ను చుట్టుముట్టి ఊపిరి సలపనీకున్న కాళులను తోలగించి న్నన్ను రక్షించు, చంద్రమౌళి*..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss