*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౧౦౧ - 101)
 కందము :
*అనుదినము కృష్ణశతకము*
*వినిన పఠించినను ముక్తి | వేడుక గలుగన్*
*ధనధాన్యము గో గణములు*
*తనయులు నభివృద్ధిపొందు | తద్దయు కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
కృష్ణా! ప్రతి రోజూ నీ ఈ కృష్ణ శతకమును విన్న, చదివినా కూడా  నీ దయవలన, చలువ వలన మాకు  ధనధాన్యాలు, సంపదలు, వంశ వృద్ధి, జీవిత చరమాంకంలో ముక్తి కలుగుతాయి వీటన్నిటి వల్ల మాకు అపరిమితమైన ఆనందము కలుగుతాయి....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*నీ పేరు గానీ, నీ రూపం గానీ, చెప్పినా, తలచుకున్నా, మాకు సర్వ సంపదలూ ఒనగూడుతాయి.  ఈ కృష్ణ శతకమును ప్రతీ రోజూ చదివినా, విన్నా కూడా అదే విధమైన ఫలితాన్ని కృష్ణ భక్తులు పొందుతారు.  అలా జరగాలన్నా నీ అనుజ్ఞ కావాలిగదా,పరాత్పరా.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss