*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౧౦౨ - 102)

 కందము :
*భరద్వాజస గోత్రుఁడు*
*గౌరనకును గంగమాంబ | కరుణా సుతుడన్*
*పేరు నృసింహా హ్వయుడన్*
*శ్రీరమణయుత నన్నుఁగావు | సృష్టిని కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
లక్ష్మీ దేవి భర్తవైన, కృష్ణా!  నేను భారద్వాజ స గోత్రము లో గౌరన, గంగమాంబ దంపతులకు గారాల పట్టిగా పుట్టి నృసింహా అని పిలవబడే వాడను.  సర్వ సృష్టి యందు దయతో, కరుణతో వుండే నీవు, నీదైన అదే సృష్టి లో భాగమైన నన్ను కూడా కాపాడు, కరుణాసముద్రా!....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*పరమేశ్వర ఆత్మబంధువులు అందరితో ఈ కృష్ణ శతక పద్యాలను పంచుకునే భాగ్యాన్ని కలిగించిన ఆ పరమేశ్వరీ పరమేశ్వరులకు త్రికరణ శుద్ధిగా శతథా కృతజ్ఞతా పూర్వక నమస్సులు అర్పిస్తూ..... సర్వం శ్రీకృష్ణార్పణమస్తు..... సర్వే జనా సుజనో భవంతు!  సర్వే సుజనా సుఖినో భవంతు!!   భవంతు కృత పుణ్యానామ్!!!*
*ఓం శాంతి! శాంతి!! శాంతిః*
*ధర్మస్య జయోస్తు! అధర్మస్య నాశోస్తు!! విశ్వస్య కళ్యాణమస్తు!!!*
*హరిః ఓం!!*
..... ఓం నమో వేంకటేశాయ
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss