తాతయ్య కథలు-11. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 సాహిత్య తన కూతురు, కొడుకును కూర్చుండబెట్టుకొని-అమ్మ నీకు ఏమి కావాలని ఉంది అని కూతురు రచనను అడగగా, కవయిత్రి కావాలని ఉంది అన్నది.
శభాష్! అనుకుంటే సరిపోదు. సాధన ఉండాలి. కలలు కనండి. సాకారం చేసుకోండి అని, అబ్దుల్ కలాం అంటుండేవారు.
బాగా చదువుకోవాలి. ఏదైనా వృత్తిలో స్థిరపడాలి. ప్రవృత్తిలోరాణించాలిఅని-కొడుకు గాత్రన్..తో నీకు ఏమి కావాలని ఉంది అని అడుగగా-అక్కకు నీలా రచనలు చేయాలని ఉంటే... అమ్మలా నేను గాయకుడిని కావాలని ఉంది.
గుడ్ మంచిదే.. తన చివరి వరకు కూడా బాల సుబ్రహ్మణ్యం గారు పాడారు. పాడే వాళ్లకు శిక్షణ ఇచ్చారు. అనగానే-కోకిల చాయలు తెచ్చి , భర్తకు, కూతురు-కొడుకు కు ఇచ్చింది.