తాతయ్య కథలు 15. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 కుక్కతో వ తప్పి అడవికి చేరింది. అడవిలో సింహం చూసి-ఎవరు నువ్వు అని, అడిగింది.
కుక్కకు ప్రాణం పోయినంత పని అయింది. ఎలాగో ధైర్యం చేసుకుని, నేను గ్రామ సింహాన్ని అన్నది. నేను సింహాన్ని ఉండగా ఇంకొక సింహమా! అని ఆశ్చర్యంగా కుక్క వైపు చూసింది.
నక్కకు ఇదే సందు గా అనిపించింది. ఎందుకు అంటే... మాటిమాటికీ నక్కను బెదిరిస్తుంది సింహం అని, అవును ప్రభు! ఈ గ్రామ సింహం ఊర్లలో వేటాడి కోళ్లను, పిల్లులను తింటుంది అని అన్నది.
అలాగా! అయితే ఇప్పటినుండి మనమిద్దరం స్నేహితులం. అన్నది కుక్కతో సింహం.
ఒక నాడు తోడేలు అక్కడకు వచ్చి-కుక్కతో స్నేహమా... అదో అల్పజీవి. నీవెక్కడ... కుక్క ఎక్కడ అంటుండగానే... మెల్లగా కుక్క అక్కడ నుండి జారుకొని, కొంత దూరం వెళ్ళాక కాళ్లకు బుద్ధి చెప్పింది. కుక్క లేకపోయేసరికి కుక్క తో స్నేహం చేయించింది అన్న, కోపంతో నక్క పై పడి చంపి తిన్నది సింహం.