తాతయ్య కథలు-17.:- ఎన్నవెళ్లి రాజమౌళి

  అరయూనదిలో నీళ్ళు తాగడానికి మిత్ర, స్నేహ, సాహసి బర్రెలు వెళ్ళాయి. నీళ్లు తాగి మిత్ర, స్నేహ ఒడ్డుకు చేరుకోగా-సాహసి అనే బర్రె ఒకటి నీళ్లు తాగుతుండగా-మొసలి కాలును పట్టుకుంది.
సాహసి ఎంతగానో కాలును మొసలి నోటి నుండి గుంజు కోవడానికి ప్రయత్నించింది. అలసిపోయి అలాగే చతికిలపడి కూర్చుంది.
ఇలా రెండు గంటలైనా.... మొసలి పట్టువదలడములేదు. బర్రె కూడా తన పట్టు వదలడం లేదు.
మళ్లీ పట్టువదలని విక్రమార్కుడిలా... మొసలి నోటి నుండి కాలును గుంజు కోవడానికి ప్రయత్నించింది.
ఈసారి గట్టిగా ఊపిరి బిగబట్టి కాలును జాడీంచింది. మొసలి నోటి నుండి  పట్టు సడలి, కాలు రావడంతో సాహసి గట్టుకు చేరి అమ్మయ్య అని-స్నేహ, మిత్ర తో కలిసింది.