తాతయ్య కథలు-20. - ఎన్నవెళ్లి రాజమౌళి

 సాహస బాలుని అవార్డు రాకేష్ రాష్ట్రపతి ద్వారా, అందుకుంటున్న అప్పుడు తల్లిదండ్రుల కళ్ళు ఆనందభాష్పాలతో నిండాయి.
రాకేష్ తల్లి శాంతమ్మ కు జరిగినదంతా న్యూస్ రీలులా కళ్ళముందు కనపడ సాగింది.
ఆరోజు రోడ్డుమీద మూడు ఏళ్ల బాలుడు ఆడుకుంటున్న అప్పుడు కారు స్పీడ్ గా దూసుకు వస్తుంటే... సైకిల్ పై వెళ్తున్న రాకేష్ సైకిల్ మీదికెల్లి దూకి వెళ్లి బాలుడిని కాపాడాడు.
ఊరంతా కదలి వచ్చి రాకేష్ సాహసానికి అభినందిస్తూ ఉంటే... నేను, ఆయన ఎంతగానో సంతోషించాము.
ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద ఘనకార్యం చేసి ఊరికి, జిల్లాకు, రాష్ట్ర ముకు పేరు తెచ్చాడు  రాకేష్. ఇదంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగానే... కొడుకు సర్టిఫికెట్ తో వచ్చి పాదాభివందనం చేయగా-దగ్గరకు తీసుకుని తల్లిదండ్రులు కౌగలించుకున్నారు.