తాతయ్య కబుర్లు-23. :- ఎన్నవెళ్లి రాజమౌళి


 


పిల్లలూ! నీ కేమి తెలుసు తొక్క అని, ఏమైతది తొక్క అని తొక్కను చులకన చేస్తుంటారు. ఆ తొక్క మీద కాలు పడితే... మూతి పళ్ళు రాలడమో, నడుమో, కాలో విరుగ క తప్పదు. అరటిపండు ఆరోగ్యానికి ఎంత మంచిదో... అరటి తొక్క మీద కాలు పడి జారిపడితే అంత ప్రమాదం. రైల్వే స్టేషనులోనైనా, బస్సు స్టేషన్ లో నైనా చెత్తబుట్టలు ఉంటాయి. అరటి పండు తిన్న తర్వాత ఆ పండు తొక్క ను చెత్త బుట్టలో వేయాలి .దారంట వెళ్లేటప్పుడు అరటి పళ్ళు తిన్న... దూరం మనుషులు నడవని ప్రదేశంలో తొక్క వేయాలి. తొక్క నే కదా! అని నిర్లక్ష్యం చేయకూడదు సుమా!