తాతయ్య కథలు-23. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 ఎందుకురా... ఇబ్బంది పడుతున్నావ్. లాక్ డౌన్ సడలించిన అప్పుడే కదా! నీవు వెళ్ళింది.
ఉదయము 6 గంటల నుండి  10 గంటల వరకు సడలింపు ఉన్నట్టే కానీ... లాక్ డౌన్ లేని నాడు కంటే... ఎక్కువ జనం.
ఎవరు కూడా కరోనాకు భయపడతలేరు  అమ్మ! అదేదో... కొంపలు అంటుకు పోయినట్లు, ప్రతివారు వీధిలోన ఉండుడే..
ఒక దిక్కు పోలీసు వాళ్లు లాఠీలు చూపించి నా... మార్పు లేదు అంటూ సామాను అమ్మ చేతికి ఇచ్చాడు.
సరే! మనమేమి చేద్దాం. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! అవును డబుల్ మాస్కు ధరించి.. నీవు శానిటైజర్ మధ్య మధ్య వేసుకున్నావా అని, అమ్మ అడుగుతుంటే... అప్పుడు వేసుకోవడమే కాదు. ఇప్పుడు సబ్బు పెట్టి కడుగు కుంటాగా.... అని బాత్రూం దిక్కు వెళ్లాడు కొడుకు.
కామెంట్‌లు