తాతయ్య కబుర్లు-24.:- ఎన్నవెళ్లి రాజమౌళి


  పిల్లలూ! అందరూ ఘంటసాల లు, బాల సుబ్రహ్మణ్యం లు కాలేరు. పాడగా పాడగా కనీసం వేదికలపై పాడే స్థాయి అన్న పెరుగుతుంది. ఉపన్యాసం అంతే... చిన్నప్పటినుండి వేదిక ఎక్కే ప్రయత్నం చేయాలి. కాళ్లు వణుకుతున్నాయి అనో, గొంతు తడబడుతుంది అనో వేదిక ఎక్కనంత సేపు అలాగే ఉండిపోతారు. తరువాత తరువాత అనేది కోరిక తీరకుండానే మిగిలిపోతుంది. పెద్దపెద్ద ఉపన్యాసకులు ఒకప్పుడు వేదికపైన భయపడుతూనే ప్రసంగించిన వాళ్లే.... పాట పాడడమైనా, ఉపన్యాసం ఇవ్వడమైనా స్కూల్లో లో జరిగే సమావేశాలను, సభలను ఉపయోగించుకోవాలి. లేకపోతే మీరు అనుకున్న గోలు ఎన్నటికీ చేరక... కోరిక కోరికగానే మిగిలిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం. వేదికలను ఉపయోగించుకుంటారు కదూ!

కామెంట్‌లు