తాతయ్య కబుర్లు-25.:ఎన్నవెళ్లి రాజమౌళి

 జై జవాన్-జై కిసాన్ నినాదాన్ని లాల్ బహుదూర్ శాస్త్రి గారు అందించినట్లు తెలుసుకున్నాం కదా! అలాగే జై విజ్ఞాన్ వాజ్పేయి అందించారు. శాస్త్రి లా ఈయన కూడా మాజీ ప్రధానే.. ఈ నినాదాన్ని శాస్త్రి గారు అందించిన నినాదానికి జతపరిచారు. జవాన్ కు నూతన మిస్సైల్స్ ను కనుగొనేది... కిసాన్ కు నూతన వంగడాలు కనుగొనే ది విజ్ఞానమే-ఏ దేశమైతే వైజ్ఞానికంగా అభివృద్ధి చెందుతుందో... ఆదేశం అన్ని రంగాలలో ముందుంటుంది. జై విజ్ఞాన్ అందించిన వాజ్పాయ్ బ్రహ్మచారి. ఆయన జీవితాన్ని అంతా దేశాభివృద్ధికే ఉపయోగించారు. పార్లమెంటులో నెహ్రూ ప్రధానిగా.... వాజ్పాయ్ ప్రతిపక్ష నేతగా అందించిన వాగ్ధాటికి... ఈయన ముందు ముందు దేశానికి ప్రధాని అవుతాడు అన్నాడట నెహ్రూ. దటీజ్ వాజ్పాయ్!
 నోటు: తాతయ్య కబుర్లు గా 25 భాగాలు మొలకలో ప్రచురించిన టీ. వేదాంత సూరి గారికి, చదివిన బాలలకు-పెద్దలకు కృతజ్ఞతలు. ఇంతటితో ముగిస్తున్నాను సెలవు. జై విజ్ఞాన్!