పాట 4 ఓ మనిషి..:-డా, గాజులనరసింహ-నాగటూరు గ్రామంకర్నూలు జిల్లా 9177071129
పల్లవి:-

ఓ మనిషీ...ఓ మనిషీ..ఓ మనిషీ
తలుపు తీసి చూడలేవ తప్పునీదని  ఎరుగలేవా
జరుగుతున్న దారుణం ఎవరు కారణం 
తెలియలేదా ఇంక నీకు ఆ నిజం

ఓ మనిషీ.. ఓ మనిషీ.. ఓ మనిషీ..
నీ తత్వ0మార్చలేదు నువ్వు మారలేదు. 
నీ అంతానికి ఆరంభం పలుకుతున్న ఆ దైవం 
ఆ సూచనలే అగుపించలేదా ప్రతీ దినం ""ఓ మనిషీ""


చరణం:- 1 

ఆనమాలు  నిలువనీ చరితలు ఎన్ని రాస్తే లాభమేమి
మంచికోసమోనిముషం ఆగిపోతే కలుగు నష్టమేమి..
నీదనుకున్నది నీవెంటే వస్తుందా..
కాదనుకున్నది  నిన్ను కాదని పోమ్మని అంటుందా..
ఓ మనిషీ..ఓ మనిషీ.. ఓ మనిషీ..
కాలమేర  అన్ని నిర్ణయిస్తుంది 
లోకమేరా నిన్ను నీకు చూపిస్తుంది
చూసుకోవ కళ్ళు ఉండి తెలుసుకోవా తెలివి ఉండి. ""ఓ మనిషీ""

చరణం:-2

డబ్బుతోటి కొనగలవా గడిచిన కాలాన్ని
తిరిగి రాయగలవా..అందరి తలరాతని..
నీ స్వార్థమేర అన్నింటికీ మూలం
నీ ఈర్ష్యయేరా..చేస్తుంది దారుణం
ఆశకల్పనలో  సాగుతుంది నీ గమనం
దురాశగ అది మారి  తెస్తుంది నీకు దుఃఖం
చూడు కనబడలేదా ఆ దృశ్యం
వినిపించలేదా ..ఆ శోకం..""ఓ మనిషీ""