తాతయ్య కథలు-7.:- ఎన్నవెళ్లి రాజమౌళి


 మర్కటాల అడవిలో కోతులు బాగా ఉన్నాయి. ఆ అడవిని చూస్తుంటే, కిష్కింద గుర్తుకువస్తుంది. ఒకరోజు ఒక కోతి ఈ చెట్టు పై నుండి ఆ చెట్టు పైకి ఆ చెట్టుపై నుండి ఈ చెట్టు పైకి దూకుతూ ఉంది.

ఇలా ఉండగా... కోతిని చిరుత చూసింది. చిరుతను చూడగానే కోతి పరిగెత్తింది.

కోతిని చిరుత వెంబడించింది. చేసేదిలేక.... కోతి చింత చెట్టు ఎక్కింది. చిరుత కూడా చెట్టు ఎక్కింది.

కోతి భయంతో కొమ్మ చివరవరకు చేరింది. ఆ కొమ్మ సన్నగా ఉంది. చిరుత ఆ కొమ్మ పైకి వెళుతుంటే... చిరుత బరువుకు కొమ్మ కిందకు జారుతుంది. కోతి బరువు తక్కువగా ఉండడం వలన ఏమైతే లేదని, నేను ఇక చివరి వరకు వెళ్తే, పడుతాను అన్న భయంతో చిరుత చెట్టు దిగి , వెళ్ళిపోతుంటే-కోతి వెక్కిరించినా... వెనుక కు చూసుకుంటూ చిరుత వెళ్ళింది.