*కరోనా సోకినవారికి మనోధైర్యం*:- అనిత ఫిరంగి-నవీ ముంబై-చరవాణి :7021267856

 *సున్నితం* రూపకర్త : *శ్రీమతి నెల్లుట్ల సునీత*
****************************
41
అందరూ మరిచిపోలేనిది కరోనా
పదేపదే కంగారు పడకండి 
అతిగా మీరు భయపడకండి 
చూడచక్కని తెలుగు సున్నితంబు
42
స్వీయ నిబంధనలు పెట్టుకోండి
అనవసరంగా బయట తిరగకండి 
అత్యవసర పనులకే అడుగేయండి 
చూడచక్కని తెలుగు సున్నితంబు
43
మాస్క్  తప్పనిసరని మరువకండి 
సనిటైజర్ మీరు రాసుకోండి
సామజిక దూరం పాటించండి  
చూడచక్కని తెలుగు సున్నితంబు
44
పోషకాలతో ఆహారం తీసుకోండి 
తేలికపాటి వ్యాయామం చేయండి 
సాంప్రదాయ అలవాట్లకు జైకొట్టండి 
చూడచక్కని తెలుగు సున్నితంబు
45
మనోధైర్యమేమనకి మందు 
అపోహలుమీరు నమ్మవద్దు
ఆందోళన మీరు చెందవద్దు
చూడచక్కని తెలుగు సున్నితంబు