విశ్వాసం - బాలల కథ:- ---- కయ్యూరు బాలసుబ్రమణ్యం 7780277240

 రాము చాలా అల్లరి పిల్లాడు. తోటి విద్యార్థులతో
ఎప్పుడూ గొడవ పడుతుండేవాడు. మూగ జీవులను బాధిస్తుండేవాడు. రాము తండ్రి వీరయ్య ఒక కుక్కని చేర దీసి పెంచుతుండేవాడు.
కాని రాము ఆ కుక్కని కూడా కొడుతుండేవాడు.
తన తండ్రి చాలా సార్లు రాము కి మూగ జంతువు
లను ప్రేమించాలని, తోటి వారితో స్నేహ పూర్వకం
గా ఉండాలని హిత బోధ చేసాడు.కాని రాము
తండ్రి మాటలను పెడచెవిన పెట్టే వాడు.
           ఒక రోజు రాము ఆడుకుంటూ పడి మోకా
లకు దెబ్బ తగిలి కుప్పకూలి పోయాడు. తోటి
స్నేహితులు అతని అల్లరికి ఇదే మంచి శాస్తి
జరిగిందని పట్టించుకోకుండా వెళ్లి పోయారు.
రాము ఏడుస్తూ అక్కడే కూర్చిండి పోయాడు.
అంతలో అటుగా వెళుతున్న తన కుక్క రాముని
పసికట్టి వెంటనే రాము తండ్రి వీరయ్య ను తీసుకు
ని వచ్చింది. వీరయ్య రాముని ఆసుపత్రికి తీసుకు
ని వెళ్ళి కట్టు కట్టించాడు. తను కుక్కని కొట్టినా
తన పై విశ్వాసం చూపి రక్షించినందుకు సిగ్గుతో
రాము తల దించుకున్నాడు. అప్పటినుండి మూగ
జీవులపై ప్రేమతో, తోటి వారితో స్నేహ పూర్వకం గా ఉండటం నేర్చుకున్నాడు.