*ప్రక్రియ పేరు : సున్నితం*:రూపకర్త : శ్రీమతి నెల్లుట్ల సునీత:-కరోనా కష్టాల్లో మనోధైర్యం కె. శైలజా శ్రీనివాస్ కలం పేరు : కృష్ణశ్రీసాయి: లెక్చరర్ విజయవాడ కృష్ణా చరవాణి:8019736254

 *166*
కంటికి కనిపించని రక్కసి
 జీవితాలు చేస్తోంది మసిమసి
రక్షణచర్యలు పాటించండి దయచేసి 
*చూడచక్కని తెలుగు సున్నితంబు*
*167*
సామాజిక దూరం పాటించండి
మాస్క్ తప్పకుండ వాడండి
అపోహలను గుడ్డిగా నమ్మకండి 
*చూడచక్కని తెలుగు సున్నితంబు*
*168*
ధైర్యంగా ముందుకు అడుగేద్దాం
వాస్తవాలను అందరూ గుర్తిద్దాం
భవిష్యత్తును మనం కాపాడుకుందాం 
*చూడచక్కని తెలుగు సున్నితంబు*
*169*
మనోధైర్యమే మనకు శ్రీరామరక్ష
ఆత్మవిశ్వాసమే రోగికిపెంచడం సురక్ష
సకాలంలోటీకాతీసుకుంటే  కరోనాకుశిక్ష 
*చూడచక్కని తెలుగు సున్నితంబు*
*170*
ప్రకృతిని  ప్రశుభ్రoముగా వుంచుదాం
పోషకహారం తీసుకుంటూ జీవిద్దాం
మానవత్వాన్ని మేల్కొలిపి మనుగడసాగిద్దాం 
*చూడచక్కని తెలుగు సున్నితంబు*