కరోనా కష్టాల్లో మనోధైర్యం:--జి.భాను వర్ధన్--ఫిరంగిపురం, గుంటూరు జిల్లా.8106586997

  ప్రక్రియ: సున్నితాలు
రూపకర్త: శ్రీమతి నెల్లుట్ల సునీత
********************************
61)
కరోనా  దూరాలు మనుషులకే  
మనసులకు లేవుగా దూరాలు
కరోనా అంతు మనోధైర్యంతోనే
చూడచక్కని తెలుగు సున్నితంబు!
62)
హైరానా పడకు కరోనాకు
పౌష్టికాహారం మెండుగా తీసుకో
స్వేచ్ఛారాగం ఆలపించు మనోధైర్యాన
చూడచక్కని తెలుగు సున్నితంబు!
63)
ఆత్మస్థైర్యమే నీకు ఆయుధం
పోరాటం చేయి వీరునివై
వైరస్సే ఇక  పరారే
చూడచక్కని తెలుగు సున్నితంబు!
64)
ఊపిరి తీసే కరోనా
గుట్టు ఇదే తెలుసుకో
ఆత్మస్థైర్యమే ఇమ్యునిటీ దేహానికి
చూడచక్కని తెలుగు సున్నితంబు!
65)
పొంచి ఉంది కరోనా
శానిటైజింగ్ చేసుకో సక్రమంగా
భౌతికదూరం పాటించు మనోధైర్యాన
చూడచక్కని తెలుగు సున్నితంబు!