స్ఫూర్తి * దీప్తి <><><><><> ~~~ సి. పి. బ్రౌను 🖋 భాషా సేవ ~~~ సేకరణ : రామానుజం. జేబులో : 8500630543 .

  సీస  పద్యం
అటకల పై   తాటియాకు  కట్ట లలోని  
        శిధిలాక్షరాలకు    జీవమూది   , 
ఆయువు తీరి     జీర్ణావస్థలో  నున్న  , 
         పలుగ్రంధ  రాజముల్   భద్రపరచి  , 
తెలుగు  ప్రబంధాల  తీరుతెన్నుల గాంచి
       మురియుచు  వ్యాఖ్యానములను వ్రాసి, 
శబ్దార్ధ   చంద్రికా       శాస్త్ర ని ర్ధారించి  , 
               శబ్దార్ధ   కోశాలు   సంక లించి  ;
తేటగీతి   :
పంచతంత్ర      కథలను ప్రపంచమునకు
తెలియ  జెప్పి , వ్యాకరణాలు  తీసి వ్రాసి  , 
తెలుగు    భాషకు   ఊపిరి  పోసి నట్టి   , 
బ్రౌను , నాంధ్రులు మోదాన బ్రస్తు తింత్రు   !! 
~~~~~~~~~~~@~~~~~~~~~~~
జననం :10-11-1798*12-12-1884  :మరణం
శ్రీ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్  🖋  వార్కి స్మృత్యంజలి