స్ఫూర్తి * దీప్తి:-లేఖనం : రామానుజం . జేబులో : 8500630543 .

       తత్త్వ వేత్త   కార్ల్ మార్క్స్
సీస  పద్యం    
కమ్యూనిజం మార్క్సు, కష్టజీవుల  పితా
         మహునిగా  పేర్గాంచె, మాన నీయు ;
సోషలిజం   ప్ర జా  సమ సమా జానికి  , 
             బాటలు   వేసిన    భవ్య  మూర్తి  , 
తను వ్రాసె, 'దాస్ కేపిటలు' నాడు నేడుా ప్ర
          మాణ గ్రంధము కాగ, మార్చె ప్రగతి  ; 
ఏంగిల్సు  తో కల్సి     మేనిఫెస్టో   వ్రాయ, 
                 కమ్యూనిజానికి   కార్య  దీక్ష  ;
తేటగీతి
ఇంట     బాధ్యత  లున్ననూ  నిల్పె దృష్టి  , 
పేద      వారల    జనజీవ్న   మేలు  కోరి   , 
ఎర్ర   జెండాతొ    యెలుగెత్తి  వెతలు తీర్చ, 
మేటి    సారధై    మార్క్సిజం  మేలుకొల్పె  !! 
         ~~~~~~~~@~~~~~~~~
జననం:05-05-1818#14-03-1883:మరణం
      కార్ల్ మార్క్స్  కు🖋 స్మృత్యంజలి