పాట:-సత్యవాణి 8639660566
 అన్నపూర్ణా నీదు హృదయము
అమృత భాండము తల్లిరో
అన్నపూర్ణా నీదు మనసే వెన్నముద్దే తల్లిరో
పెట్టి పుట్టని వారికైనను
పెడుదువన్నము తల్లిరో
కన్నతల్లివి కరుణ నిధివి
కాశిలో నెలకుంటివి
ఆది భిక్షువు కన్నమొసగిన
అమ్మ నీ దయ అపూర్వము
కోట్ల ఆర్తుల కొంగు పశిడివి
కొమ్మరో నిను కొలుతుము
కరుణ చిందే నీదు కన్నులు
కాంచుటే ఒక భాగ్యము
తేజమొలికే నీదు వదనము
తిలకంచగ మహా పులకింతలే
పూలపూజలు చేతునమ్మా
పుత్తడిీ బంగారు తల్లీ
దయను వీడకు తల్లి మాపై
దర్శనంబులు యొసగుమా
హారతిద్దుము అంబరో నీకును
అఖిల జగమును గాచుమా
ఆర్తి తీర్చగ అన్నపూర్ణా
అక్షయం నీమానసం
జ్ఞాన భిక్షను జనని యొసగీ
సుజ్ఞాన వంతుల జేయుము