కందము :
*కొంచెపు వాఁడని మదిలో*
*నెంచకుమీ వాసుదేవ | గోవింద హరీ*
*యంచితముగ నీ కరుణకు*
*గొంచెము నధికము గలదె | కొంకయు కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
వసుదేవుని కుమారుడవై, స్వర్గం లో విహరించేవాడివి యైన కృష్ణా! నీవు చూపించే దయ, కరుణలకు కొంచెము ఎక్కువ అనే తేడా లేదు కదా, కంసారి. నేను విన్నవాడను, తక్కవ వాడను అని నీ మనసులో ఆలోచింపక, నన్ను రక్షించు పరేశా!!....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*గోవింద, ముకుంద, మురారి నీవు ఈ భువన భాండంలో నిండివున్నప్పుడు, స్వర్గం లో విహరిచడం నీకు కొత్తా కాదు, నీకు తెలియని ఆనందం కాదు. ఒకరు ఎక్కవ వేరొకరు తక్కువ అనే భావం నీవు ఎవ్వరి యందు చూపించవు కదా. మరి నన్ను చిన్న వాడిగా, తక్కువ వాడిగా నీ మనసులో అనుకోవడం అనేది జరగనిపని. నీవే దిక్కు అని నమ్మిన నన్ను నీవే రక్షింగలవు కృష్ణా! నీవు తప్ప అన్య మెరుగ.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి