ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999

 గా పల్లెటూల్లన్నా,
పల్లెటూరోల్లన్నా
సిన్న సూపు సూడకండ్రి.
గీ పట్నపొల్లు మేసేది
పల్లెల గాసమేనుల్లా!
నా సిన్నపుడు
గా పల్లెటూరోల్లు
మాయా,మర్మం తెలువనోల్లు
కల్తీ,మోసం సేయనోల్లు 
మాట మీద నిలబడేటోల్లు
సోపతికి పానం ఇచ్చేటోల్లు
ఆపతికి,సంపతికి
ఆదుకునేటోల్లు
కట్టమచ్చినా,సుకమచ్చినా
నలుగురితో పంచుకునేటోల్లు
ఉన్నదాంట్లనే 
సదురుకునే టోల్లు
ఉపాసమన్న ఉంటరు గని
దొంగ తనం, లంగ తనం 
సేయనోల్లు
మున్నూట అరవై ఐదు దినాలు కట్టపడేటోల్లు.
సుట్టాలచ్చినా,
పండుగులచ్చినా
సంబుర పడేటోల్లు
ఇంటికచ్చిన బిచ్చగాల్లకు 
ఏదో ఒకటిచ్చి పంపేటోల్లు
గివన్నీ ఎందుకు?
ఒక్క మాటల సెప్పాలంటే...
మంచితనానికి
మనిషితనానికి 
మారు పేరు పల్లెటూరోల్లు
ఔ మల్ల!