మా ఊల్లె
గీ ఎండ కాలంల
పొద్దూకి నంక
ఆకిట్లనే
నులుక మంచాలు ఏసుకొని పండుకునేటోల్లు.
నేను బువ్వ తిన్నంక
మా ఆకిట్ల
నులుక మంచం ఏసుకొని, దాని మీద లీల్లు జల్లి,
బొంత పరుసుకొని
ఎల్లెలుకల పండుకొని
మొగులును,తెప్పెలను,
సుక్కలను సూసుకుంట
మా అవ్వ సెప్పే సాత్రాలను,
మా నాన సెప్పె లెక్కలను,
వయిల ఉన్న పాఠాలను
ఇనుకుంట , ఇనుకుంటనే
నిద్ర పోయేటోన్ని,
ఇంట్ల పండుకున్నప్పుడు
దోమల గురించి మా అవ్వ
మంచం కింద కుంపటి పెట్టేది.
గా కుంపటి పొగకు దోమలు
అచ్చేటివి కాదు.
ఎండ కాలంల అందరు
అకిట్ల మంచాలేసుకొని
పండుకుంటరని
దొంగలు ఇండ్లల్లకచ్చి
దొరికిన కాడికి
దోసుకొని పోయేటోల్లు.
పక్కూర్లల్ల దొంగ 'బానడు ' మాత్రం ముసలోల్ల సెవుల గెంటీలు, పుత్తెల తాడు, బంగారు కంటె,
ముక్కు పుల్లలు గుడ ఒర్రంగ
గుంజుక పోయేటోడు.
గదెందో గని
మా ఊల్లెకు మాత్రం
దొంగలు అచ్చెటోల్లు కాదు గని
మా ఊరికి బిచ్చెపోల్లు శానా మంది అచ్చెటోల్లు.
అచ్చిన ఏ బిచ్చెపోడు గుడ
ఉత్తగ పోయేటోడు కాదుల్లా!
బువ్వనో, అడ్లో, బియ్యమో,
పైసలో ఇచ్చి పంపేటోల్లం.
మా మల్లారమంటే
దయ గల్ల ఊరని
సుట్టు పక్కల ఇరువై, ముప్పై ఊర్లల్లకు ఎరుక.
మా ఊరంటే
మంచితనానికి,
దాన దర్మాలకు మంచిపేరుల్లా!
మల్లారమంటే
ఆత్మ గల్ల ఊరు.
ఔ మల్ల!
ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 3971 999
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి