కరోనా కష్టాల్లో మనోధైర్యం:-. పుష్పలీల రేవతి--. హైదరాబాద్చరవాని...8790958751

 ప్రక్రియ... సున్నితం
రూపకర్త... శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
.......................................
71.
కరోనా వచ్చిందని భయపడకు
తగుజాగ్రత్తలు తీసుకోవుటే ముద్దు
బయటికి వెళ్లకుండా గీసుకోండిహద్దు
చూడచక్కని తెలుగు సున్నితంబు
72.
పౌష్టిక ఆహారం భుజించు
నీకుఅండగా ఉంది ఆరోగ్యసేతు
సమయానికి మందులు మరవకు
చూడచక్కని తెలుగు సున్నితంబు
73.
కరోనావార్తలు అస్సలు వినకు
వార్త పత్రికలు చదవకు
యోగా, ధ్యానం చేయినిత్యం
చూడచక్కని తెలుగు సున్నితంబు
74.
సంగీతం విని ఆనందించు
చరవాణితో ఆత్మీయులతో మాటాడు
నచ్చినపని చేయి ఏదైనా
చూడచక్కని తెలుగు సున్నితంబు
75.
మనోబలానికి మించిన మందులేదు
మంచి పుస్తకాలు చదువు
మంచి ప్రవచనాలు విను
చూడచక్కని తెలుగు సున్నితంబు