కందము :
*అయ్యా పంచేంద్రియములు* *నుయ్యాలల నూచినట్టు | లూచగ నేనున్*
*నీ యాజ్ఞ దలఁపనేరను*
*కుయ్యాలింపుము మహాత్మ | గురుతుగ కృష్ణా !*
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
తండ్రీ దేవాధిదేవా, వాసుదేవా, చర్మము, కన్ను, ముక్కు, నోరు, చెవి అనే పంచేంద్రియాలతో కూడిన శరీరాన్ని ఉయ్యాలలో వుంచి వూపినట్లు నేను కూడా నీ మాట అర్ధంకాక మతి తప్పి ఇటు అటు తిరుగుతున్నాను. నా మొర గుర్తించి నన్ను కాపాడు....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*గోపాలా, నీ మాయ అనే ఉయ్యాలలో ఊయలలూగి ఊగీ, అది నీ మాయ అనే విషయాన్ని మరిచిపోయి బ్రతికేస్తున్నాము. ఇంక నీతో వుంటేనే మాకు ముక్తి అనే విషయం మాకు ఎక్కడ గుర్తు వుంటుంది, జగద్రక్షకా! ఈ మాయా శరీరాన్ని మోస్తూ వున్న నన్ను నీవు తప్ప వేరెవరూ రక్షించ లేరు. నా దీనాతి దీనమైన మొరను ఆలకించి నన్ను రక్షించు, సత్యావల్లభా!!*
.....ఓం నమో వేంకటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి