కె.ఎం.మున్షీ:--.ఎ రాజశ్రీ 8985035283

 భారతీయ విద్యా భవన్ స్థాపించిన సాహితీ మూర్తి!
సోమనాథ్ మందిర  పునర్నిర్మాణ రధసారధి!
30జనవరిలో భరూచ్ లో పుట్టి 
8ఫిబ్రవరి  1971లో తరలిపోయిన  భారతీ సంస్కృతి సాంప్రదాయం కి
పట్టం కట్టిన  కన్హయలాల్
మాణిక్ లాల్  మున్షీ
[21/5, 2:45 pm] Rajasri A: అరవిందఘోష్  శిష్యుడిగా 
ఆధ్యాత్మిక భావాలు విరిసే
లాయర్ గా బొంబాయిలోరాణించి 
భారత రాజ్యాంగరచనలో
అంబేద్కర్ కి సహకరించి
సాహిత్యం  సమాజసేవకే 
అంకితం  నీ జీవితం!
హోంరూల్ ఉద్యమంలో 
సురేంద్ర నాధ్ బెనర్జీ  గాంధీజీతో  అడుగు వేసి 
జైల్లో గడిపావు!
ప్రాక్టీసు మానేసి గుజరాతీ  సాహిత్య సంసద్ నెలకొల్పి
ఘనశ్యాంవ్యాస్ కలంపేరుతో 
చారిత్రక పౌరాణిక కధల్ని
హిందీఆంగ్లం లో రాసి దేశభక్తి 
దైవభక్తి  రగిల్చిన సంగతి
మాకు తెలీదు!మేము ఫోన్ 
టి.వి.జీవులం కదా!?
 బాంబేసిటీఆంబ్ లెన్స్ దళాన్ని
వాటి వైద్య సేవలు విస్తరింపజేశావు!
కాంగ్రెస్ నించి విడిపోయి 
స్వతంత్ర పార్టీపెట్టావు
రాజకీయ కుళ్ళు  భరించలేక 1938లోభారతీయవిద్యాభవన్
నెలకొల్పి సంస్కృతభాష పరిమళింప జేసి అఖండ హిందూస్థాన్ మంత్రం పఠించావు
మాటలు  చేతలు ఒక్కటే 
స్త్రీవిద్య  వితంతువివాహాలు
ప్రోత్సాహించి వితంతు లీలావతి సేఠ్ ని పెళ్లాడి
సంఘసేవలో తరించావు!
ఆనాడే వనమహోత్సవంకి శ్రీకారం  చుట్టి చెట్లు నాటించావు!
ఆధునిక భారత దేశం 
ఓమాణిక్!నిన్ను మరిచింది!?
కనీసం  ఇప్పుడైనా మేలుకుని
మీ అందరి నీ తలుచుకుంటూ 
ఏమాత్రం  ఆచరణలో పెట్టి
బడులలో  మోరల్ సైన్సు క్లాస్
పెడితే  బాగుండు!?
 కానీ పిల్లలకి  చెప్పేదెవరు?
పిల్లిమెడలో గంట కట్టేదెవరు!??.....స్వస్తి...