మాట సాయం (చిన్నకథ)--.అచ్యుతుని రాజ్యశ్రీహైదరాబాద్ 8985035283

 మాట సాయం తోపాటు ఇతరుల తోడ్పాటువుంటే మనంఎన్నో పనులు సాధించవచ్చు. అడవిలో జంతువులు తమ జాతిని కాపాడుకునేందుకు కలిసికట్టుగా ఐక్యమత్యంతోఉంటాయి. ఆరోజు చీమపాపాయిలు"అమ్మా!ఆకలి.తింటానికి ఏమైనా పెట్టు"అని రాణిచీమ ను బతిమలాడి సతాయిస్తుంటే  ఆమె  తన కింది కూలీచీమల్ని పిల్చి"పిల్లలు  ఆకలితో అల్లాడుతున్నారు. త్వరగా తింటానికి ఏదన్నా తెండి "అని పురమాయించింది.  శ్రామిక చీమలు పొలోమంటూ తలా ఒకవైపు  రయ్ న సాగాయి. చతుర అనే చీమ మహా తెలివిగలది.అడవివైపు కొన్ని ఎలుగుబంట్లు సాగిపోటం చూసింది. ఒకముసలి ఎలుగు దగ్గరకెళ్ళి "తాతా!ఏంటీ  మీవారంతా పొలోమంటూ  ఆదిక్కుకెళ్ళుతున్నారు?  అని అడిగింది. "ఆచివరి చెట్లకి తేనె తుట్టెలున్నాయి.వాటిని తింటానికి ". చతుర కూడా అక్కడ కెళ్ళి  తన పొట్టనిండా తేనె పట్టించి  బానకడుపుతో తన పుట్టదగ్గరకి ఎలా చేరాలా?"అని ఆలోచిస్తోంది. ఇంతలో ఒక ఈగ ఎగురుతూ  రావటం చూసి "బావా  నన్ను  నీవీపుపై ఎక్కించుకోవా"దీనంగా అడిగింది. "నేను నిన్ను మోయలేను. ఆపిట్టను అడుగు." పిట్ట రెక్కలలో దూరి దారి చెప్పింది. అలా ఆమంచిపరోపకారి పిట్ట చీమను  పుట్టదగ్గర దింపి  ఎగిరిపోయింది. చీమ  తమ పాపాయిల నోటి కి తేనె అందించినది. ఇలాతనమాటలతో పిట్ట మంచి తనంతో చతురత చూపిన  చతుర అందరి మెప్పు పొందినది...స్వస్తి..