*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౯౦ - 90)

 కందము :
*కంటికి రెప్పవిధంబున*
*బంటుగదా యనుచు నన్ను | బాయక యెపుడున్*
*జంటయి నీ వుండుట నే*
*కంటకమగు పాపములను | గడచితి కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
పరమాత్మా, పరంధామా, పరాత్పరా,  కంటికి రెప్పలాగా, నాకు నువ్వు ఎప్పుడూ, అన్ని వేళలా,  రక్ణణ కవచం లాగా వుంటం వల్లనే నేను ఎన్నో ఇబ్బందుల నుండి,  కష్టాల నుండి గట్టెక్క గలిగాను. ఇది అంతా నీ దయవల్లే సాధ్యమైంది కదా, నా కన్నతండ్రీ!.....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*రామా, పరంధామా, నీ కరుణ, దయ నాయందు లేకపోతే నేను లేను అనేది నిత్య సత్యం. నేను నీవు వేరు వేరు కాదు అనేది సత్యం కదా. కనుగుడ్డుకు కంటి రెప్ప, తాబేలుకు వీపున రక్షణ చిప్ప వున్నట్లు, నీవు నన్ను ప్రతిక్షణమూ కాపాడుతుండగా నాకేమి లోపం కలగదు కదా. నీవే, నీవే తక్క వేరేమీ లేదు.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు