*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౯౧ - 91)

 కందము :
*యమునికి నిక నే వెరవను*
*కమలాక్ష జగన్నివాస | కామితఫలదా*
*విమలమగు నీదు నామము*
*నమరఁగ దలఁచెదను వేగ | ననిశము కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
తామార పువ్వులవంటి కన్నులున్న వాడా, ఈ జగాలు అన్నిటినీ నీ లోనే బుంచుకున్న వాడా, శ్రీ కృష్ణా!!!  మా అన్ని కోరికలు తీర్చే నీ పేరునే పట్టుకుని వున్నము కదా, పరంధామా!  నీవు, నీ పేరు మాకు తోడుగా వున్నప్పుడు మా ప్రాణాలు తీసే యమధర్మరాజుకు అయినా మేము భయపడము.  నీవు మాతో వుండగా యమధర్మరాజు మమ్మల్ని ఏమీ చేయలేడు, పరమేశ్వర!!! ....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*మార్కండేయునికి అల్ప వయస్కుడిగా, చిరకాల యశస్సుడిగా ఆశీర్వదించాడు పరమేశ్వరుడు.  ఆయుశ్శునిండింది అని మార్కండేయుని తీసుకు వెళ్ళడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు, ఆ బాలుడు తను నమ్ముకున్న రోజూ పూజించే శివలింగాన్ని కౌగలించుకుని, "నాకు శివుడే రక్షకుడు. ఆయనే నన్ను కాపాడుతాడు" అని వేడుకున్నాడు.  అప్పుడు పరమేశ్వరుడు యమధర్మరాజు కు అడ్డు పడి, మార్కండేయుని చిరాయుష్కుని చేసాడు.  ఇది నిక్కమైన సత్యము.  పరమాత్ముని నమ్మిన వారిని సూర్యపుత్రుడు కూడా ఏమీ చేయలేడు. అందుకే, శిఓ రక్షతు! శిఓ రక్షతు!! శిఓ రక్షతు!!!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss