పచ్చని సంసారానికి పది సూత్రాలు:-- పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్...9110784502
 1.
వాదించుకోండి, కాని వాదనలో గెలిచేది ఒక్కరేనని తెలుసుకోండి. వేదన, వ్యధ మాత్రం యెదలో మిగిలి పోతుందని, బ్రతుకు రగిలిపోతుందని, 
మాత్రం గుర్తుంచుకండి
2. 
ప్రేమతో తిట్టుకోండి,కాని కోపంతో కొట్టుకోకండి. 
ఒకరిని ఒకరు బజారులోనికి నెట్టుకోకండి.
3. 
గతాన్ని త్రవ్వుకోకండి. గందరగోళంలో పడకండి
4. 
ఈ జగతిలోఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోవాలి. ఒకరిని ఒకరు 
ఎత్తుకొని ఇల్లంతా తిరగాలి. అప్పుడు 
మనసంతా ఎంతో హాయిగా వుంటుంది. 
నామాట నమ్మండి
5. 
ఇద్దరి మధ్య అపార్ధాలనే అగ్గి రగిలితే 
ఆనిప్పును చల్లర్చకుండా ఎప్పుడూ నిద్రపోకండి
6. 
అన్నింటికీ స్పందించండి. 
ఒకరికి ఒకరి ఎప్పుడో ఒకప్పుడో 
ఏదో ఒక Special Day సందర్భంగా 
ఒక Surprise Gift ఇచ్చిపుచ్చుకోండి. 
అభినందించుకోండి. గట్టిగా ఆలింగనం చేసుకోండి. 
ఆత్మకు తృప్తిగావుంటుంది.అనురాగం చిగురిస్తుంది.    
7. 
ఎవరైనా తప్పు చేస్తే ముందు ఒప్పుకోండి. 
మూర్ఖత్వానికి ముసుగు కప్పుకోండి.
8. 
ఎదకు తగిలిన మానని గాయాలు, 
మిగిలివున్న తీపి జ్ఞాపకాలను మింగివేస్తాయి
9. 
ముఖాముఖి చర్చలే మనస్పర్ధలకు మందులు. 
అందుకే మీ సమస్యల్ని మీరే చర్చించుకోండి. పరిష్కరించుకోండి. మీ ఇద్దరికి మధ్య మూడోవ్యక్తి 
ఎంటర్ ఐతే ముప్పేనని, మీ పచ్చని కాపురానికి 
అది కారుచిచ్చేనని, తెలుసుకోండి.
10. 
భర్తకు భార్య దేవత, భార్యకు భర్త భగవంతుడు 
అందించిన బంగారు వరమని భావించండి, 
భగవంతున్ని నిత్యం ప్రార్ధించండి. 
ఆ భగవంతుడే తోడుంటే 
ఏ బాధలు మిమ్మల్ని వెంటాడవు 
అప్పుడు మీ 
మదినిండా ప్రశాంతతే...మీ
పడకగది నిండా పకపకలే ఇకఇకలే...
నవ్వుల పువ్వుల తొలకరి జల్లులే.... 
ఆ సంసారం సుఖసంసారమే....
అందరికీ ఆ దంపతులు  ఆదర్శమే...